కరోనా భయంలేకుండా...

తాజా వార్తలు

Published : 14/06/2020 00:50 IST

కరోనా భయంలేకుండా...

ఇండోర్‌: ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ అందరిలోనూ భయాందోళనలను రేకెత్తిస్తోంది. నివారణే తప్ప చికిత్స లేని ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు నిపుణులు సూచించిన విధంగా భౌతిక దూరం వంటి నియమాలను పాటిస్తున్నారు. ఒకరినొకరు తాకటానికే సందేహిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన కొవిడ్‌-19ను కూడా లక్ష్యపెట్టని ప్రబుద్ధులు కొందరు ఈ వ్యాధి సోకిన వ్యక్తికి చెందిన వస్తువులను మాయం చేశారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది.

హరీశ్‌ గౌర్‌ అనే 36 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో స్థానిక ఎంజీఎం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేరాడు. అయితే మూడు రోజుల అనంతరం మరణించిన ఆయనకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. కాగా, ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యులకు సిబ్బంది మృతదేహాన్ని అప్పగించారు. అయితే హరీశ్‌ పర్సు, మొబైల్‌ ఫోను కనపడకపోవటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు... ఆ విషయాన్ని సిబ్బందికి తెలియచేశారు. కాగా ఆ వస్తువులను తర్వాత ఇస్తామని ఆస్పత్రి సిబ్బంది వారికి చెప్పారు. కానీ ఒక నెల పైగా గడిచినా ఇప్పటి వరకు పర్సు, మొబైల్‌ లభించకపోవటంతో.. మృతుడి బావమరిది మనీష్‌ గౌర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని