Karvy: కార్వీలో ‘శ్రీకృష్ణ’ లీలలు

తాజా వార్తలు

Updated : 22/09/2021 11:40 IST

Karvy: కార్వీలో ‘శ్రీకృష్ణ’ లీలలు

బినామీ కంపెనీలు సృష్టించిన వైస్‌ప్రెసిడెంట్‌ అరెస్ట్‌

ఎనిమిదేళ్లలో రూ. 300 కోట్ల మళ్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకృష్ణ గురజాడను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీపీ హరికృష్ణ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని సొంతానికి వినియోగించుకునేందుకు ఆయన ఎనిమిదేళ్ల కిందట ప్రణాళికను సిద్ధం చేశాడు. సదరు సంస్థ ఛైర్మన్‌ పార్థసారథితో కలిసి రూ. 300 కోట్లు మళ్లించాడు. పార్థసారథి ఫోను, లాప్‌టాప్‌లోని వివరాల ఆధారంగా పోలీసులు పరిశోధించగా.. శ్రీకృష్ణ అక్రమ లావాదేవీలకు ఆధారాలు లభించాయి. కార్వీలో శ్రీకృష్ణ ఇరవై ఏళ్ల కిందట చిరుద్యోగిగా చేరి వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయికి చేరాడు. కొన్నేళ్లుగా వినియోగదారుల షేర్లు, డీమ్యాట్‌ ఖాతాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి వ్యాపార విస్తరణ పేరుతో పదిహేనేళ్లుగా వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ కిస్తీలు చెల్లిస్తున్నాడు. వ్యాపారంలో నష్టపోయినట్లుగా బ్యాంకులను నమ్మిస్తే రూ.కోట్లు వెనకేసుకోవచ్చనే ఉద్దేశంతో పార్థసారథి, శ్రీకృష్ణ ప్రణాళిక రూపొందించారు. శ్రీకృష్ణ తొమ్మిది డొల్ల కంపెనీలను సృష్టించాడు. వాటితో వ్యాపారాలు చేసి నష్టపోయామని రికార్డులు తయారుచేశాడు. నష్టంగా చూపించిన రూ. 300 కోట్లను బినామీ ఖాతాలకు మళ్లించి సొంతానికి వాడుకున్నారు. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అక్రమాలపై నెల వ్యవధిలో ఆ సంస్థ ఛైర్మన్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని