Gold smuggling: ఇది ప్యాంట్‌పై రంగు కాదు.. గోల్డ్‌ స్మగ్లింగ్‌లో వేరే లెవెల్!

తాజా వార్తలు

Published : 31/08/2021 01:45 IST

Gold smuggling: ఇది ప్యాంట్‌పై రంగు కాదు.. గోల్డ్‌ స్మగ్లింగ్‌లో వేరే లెవెల్!

కొచ్చి:  బంగారాన్ని ఆభరణాల రూపంలో లేదా బిస్కెట్ల రూపంలో అక్రమ రవాణా చేయడం మనం తరచూ చూస్తున్నాం.. కానీ ఈ విలువైన లోహాన్ని తరలించడంలో అధికారుల కళ్లుగప్పేందుకు కొందరు స్మగ్లర్లు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఇటీవల అమృత్‌సర్‌లో ఓ వ్యక్తి బంగారం ముద్దను లోదుస్తుల్లో దాచి తరలిస్తూ పట్టుబడగా.. తాజాగా కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో బంగారాన్ని పలుచటి ముద్దలా చేసి పూత పూసిన ప్యాంట్‌ ధరించి తరలిస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..  కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో కన్నూరు ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు సోమవారం రూ.14లక్షల విలువ చేసే 302 గ్రాముల బంగారం పట్టుకున్నారు. అయితే, దీన్ని తరలించేందుకు స్మగ్లర్లు అనుసరించిన విధానం చూసి కంగుతిన్నారు. బంగారాన్ని పలుచటి పేస్ట్‌లా మార్చి దాన్ని రెండు ప్యాంట్‌ల మధ్య రంగు మాదిరిగా పూసి తరలించడం చూసి షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో.. పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాట్‌ ఏ టెక్నిక్‌.... అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను పెద్ద అయ్యాక కేరళలో కస్టమ్స్‌ అధికారి అవుతానంటూ మరో వ్యక్తి ట్వీట్‌ చేశారు. 

బంగారం అక్రమ రవాణాలో స్మగ్లర్లు కొత్త టెక్నిక్‌లు అనుసరించడం కొత్తేం కాదు. ఇటీవల అమృత్‌సర్‌లో షార్జా నుంచి వస్తున్న ఓ వ్యక్తి తన లో దుస్తుల్లో రూ.78లక్షల విలువ చేసే 1894 గ్రాముల బంగారాన్ని ముద్దలా చేసి తరలించి అరెస్టయిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని