AP News: రిటైర్డ్‌ హెచ్‌ఎం కోటయ్య మృతి

తాజా వార్తలు

Updated : 31/05/2021 13:11 IST

AP News: రిటైర్డ్‌ హెచ్‌ఎం కోటయ్య మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతిచెందారు. కరోనా సోకడంతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్‌లో ఆయన చేరారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. కరోనా సోకిన తర్వాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధాన్ని కోటయ్య తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆక్సిజన్‌ స్థాయి మెరుగుపడటంతో కోలుకున్నట్లు కోటయ్య గతంలో ప్రకటించారు.

ఆ తర్వాత ఆయాసంగా ఉండటంతో కొన్ని రోజుల పాటు కోట సీహెచ్‌సీలో కోటయ్య చికిత్స పొందారు. మూడు రోజుల క్రితం ఆయన ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతుండటంతో నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు. కోటయ్య ప్రకటన తర్వాతే ఆనందయ్య ఆయుర్వేద ఔషధానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని