నదిలోకి దూసుకెళ్లి జీపు: 10మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 23/04/2021 15:19 IST

నదిలోకి దూసుకెళ్లి జీపు: 10మంది మృతి

పట్నా: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలోకి జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరికొంత మంది గల్లంతయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్నా జిల్లా పీపాపుల్‌ వద్ద శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో జీపులో 15 మంది ఉన్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నా్యి. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ శుభకార్యానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతివేగంతో వచ్చిన జీపు వంతెనపైకి రాగానే అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం సమయంలో ఇద్దరు జీపు పైభాగంలో కూడా కూర్చున్నట్లు వెల్లడించారు. జీపు నదిలో పడుతున్న క్రమంలో పైన ఉన్న ఇద్దరూ ముందే దూకేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని