Accident: నెత్తురోడిన తెలుగు రాష్ట్రాల రోడ్లు

తాజా వార్తలు

Updated : 04/07/2021 09:55 IST

Accident: నెత్తురోడిన తెలుగు రాష్ట్రాల రోడ్లు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం చోటు చేసుకున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. హైదరాబాద్‌ నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో కిందపడ్డారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రెడీమిక్స్‌ వాహనం వీరిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను మహారాష్ట్రకు చెందిన కమ్రుద్దీన్, బబ్లూ, జమీల్‌గా గుర్తించారు. వీరు లంగర్‌హౌస్‌లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలిలో డివైడర్‌ను ఆటో ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూకు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

తిరుపతి అలిపిరి రోడ్డులో ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని