close

తాజా వార్తలు

ఓఎల్‌ఎక్స్‌లో బైక్‌ పెట్టాడు.. నగదు కాజేశాడు..

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆర్మీ అధికారి ఫొటో పెట్టి.. కింద ఓ ద్విచక్ర వాహనాన్ని ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. తనకు బదిలీ వచ్చిందని, ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తానని పోస్టులో రాసి ఉంది. ఈ విషయాన్ని గమనించిన నగరంలోని నీరుగంటివీధికి చెందిన రోషన్‌ జమీర్‌ బైక్‌ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఆర్మీ అధికారి వినియోగించిన బైక్‌ కావడంతో వాహనం కండిషన్‌లో ఉంటుందని భావించాడు. పోస్టులో ఉంచిన ఫోన్‌ నంబరును సంప్రదించాడు. తొలుత తన ఖాతాలోకి రూ.2 వేలు వేయాలని ఆ వ్యక్తి సూచించగా.. నగదు జమ చేశాడు. రెండోసారి రూ.10 వేలు వేశాడు. తర్వాత ఆ ఫోన్‌ నంబరు పని చేయకుండా పోయింది. తాను సైబర్‌ నేరస్థుడి చేతిలో మోసపోయానని తెలుసుకుని రోషన్‌ జమీర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.