close

తాజా వార్తలు

Updated : 15/04/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాతకక్షలకు ఆరుగురి బలి

 ఇల్లంతా రక్తపు మడుగు.. చెల్లచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం. పెద్దలు మొదలకుని పసికందు వరకు కనికరం లేకుండా అత్యంత పాశవికంగా హతమార్చాడు. కాళ్లూ చేతులు ఎక్కడ పడితే అక్కడ నరికేశాడు. మాటు వేసి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు పదునైన ఆయుధంతో నరమేధం సృష్టించాడు. ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేశాడు.

పెందుర్తి: విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి మండలం జుత్తాడలో పాత కక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలయ్యారు. కొద్ది రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పల రాజు అనే వ్యక్తి ఆర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మరో కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటనతో జుత్తాడలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతులు బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(37), ఉషారాణి పిల్లలు బమ్మిడి ఉదయ్‌(2), బమ్మిడి ఉర్విష(6 నెలలు)గా గుర్తించారు.

హత్యలతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. బమ్మిడి రమణ నివాసం రక్తపు మడుగుగా మారింది. ఘటనకు.. కుటుంబ కక్షలా? వివాహేతర సంబంధమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట అరుగు శుభ్రపరుస్తున్న ఉషారాణిని చంపి ఆతర్వాత మంచంపై నిద్రిస్తున్న ఉదయ్‌, ఉర్విషను హతమార్చాడు. అనంతరం స్నానాల గదిలో దాక్కున్న బమిడి రమణ, ఆయన చెల్లెలిని నరికి చంపాడు. హత్యలు చేసిన అనంతరం అప్పలరాజు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గురైన కుటుంబం ఇటీవలే విజయవాడ నుంచి వచ్చిందని బంధువులు తెలిపారు. ఘటనా స్థలిని విశాఖ సీపీ మనీశ్‌ కుమార్‌ సిన్హా పరిశీలించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని