‘తీన్మార్‌ మల్లన్నపై కేసుల్లో 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి’

తాజా వార్తలు

Updated : 11/08/2021 05:48 IST

‘తీన్మార్‌ మల్లన్నపై కేసుల్లో 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి’

ఈనాడు, దిల్లీ: చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న)పై వేధింపులు, నమోదు చేసిన కేసులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ను జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్సీబీసీ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు. తనపై పోలీసులు 30కిపైగా తప్పుడు కేసులు మోపారని తీన్మార్‌ మల్లన్న ఎన్సీబీసీకి లేఖ రాశారు. లేఖకు ఎన్సీబీసీ సభ్యుడు ఆచారి స్పందించారు. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించకపోతే కమిషన్‌కు ఉన్న అధికారాలతో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ సమన్లు జారీ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని