CM Jagan: సీబీఐవి తప్పుడు అభియోగాలు.. నా పేరు తొలగించండి: జగన్‌

తాజా వార్తలు

Published : 28/08/2021 02:18 IST

CM Jagan: సీబీఐవి తప్పుడు అభియోగాలు.. నా పేరు తొలగించండి: జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్‌బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని జగన్ కోర్టుకు తెలిపారు. అదే ఛార్జ్ షీట్‌లో రెండో నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తన పేరు తొలగించాలని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణ సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. పెన్నా కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా ఛార్జ్‌షీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు శామ్యూల్, వి.డి.రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని