Road Accident: మానకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

తాజా వార్తలు

Updated : 26/11/2021 11:31 IST

Road Accident: మానకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

మానుకొండూరు: కరీంనగర్‌ జిల్లా మానకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కారు చెట్టును ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.  

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ ప్రాంతంలోని జ్యోతినగర్‌కు చెందిన కొప్పుల శ్రీనివాసరావు, కొప్పుల బాలాజీ, శ్రీరాజు, జలంధర్‌, సుధాకర్‌రావు గురువారం ఉదయం బంధువుల పెద్దకర్మ కార్యక్రమానికి ఖమ్మంలోని కల్లూరుకు వెళ్లారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి కరీంనగర్‌కు బయలు దేరారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున మానుకొండూరు సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, బాలాజీ, శ్రీరాజు, జలంధర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న మానుకొండూరు సీఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు.  తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని