Crime News: క్యాబ్‌లో మహిళపై అత్యాచారం.. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌ వాసి

తాజా వార్తలు

Published : 23/09/2021 01:55 IST

Crime News: క్యాబ్‌లో మహిళపై అత్యాచారం.. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌ వాసి

బెంగళూరు: ఊబర్‌ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడైన క్యాబ్ డ్రైవర్‌​ను అరెస్టు చేశారు. కర్ణాటకలో కలకలం రేపిన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలోనూ లేవనెత్తాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.  

జార్ఖండ్‌కు చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆమె హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఉండే తన స్నేహితురాలి ఇంటికి పార్టీకి వెళ్లింది. పార్టీ అనంతరం మురుగేశ్ పాళ్యలోని తన ఇంటికి వెళ్లేందుకు బుధవారం తెల్లవారుజామున ఉబర్‌ క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో తన ఇంటి సమీపానికి చేరుకున్నాక.. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి డ్రైవర్ తనపై శారీరకంగా దాడి చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత తనను క్యాబ్‌లోనుంచి తోసేశాడని తెలిపింది. 

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ దేవరాజ్‌ను అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ క్యాబ్‌ ఎక్కగానే నిద్రపోయిందని.. దీనిని అదునుగా తీసుకున్న నిందితుడు క్యాబ్​ను ఆమె ఇంటి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. డ్రైవర్ తన క్యాబ్​ను​ దాదాపు 20 నిమిషాల పాటు ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచినట్లు గుర్తించారు. ఇతర ఆధారాలను సైతం సేకరించినట్లు తెలిపారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు అసెంబ్లీలో అత్యాచార ఘటనల సెగ తగిలింది. ఆగస్టు 24న జరిగిన మైసూరు గ్యాంగ్ రేప్‌తోపాటు తాజా క్యాబ్‌ డ్రైవర్‌ అత్యాచారం ఘటనలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే బసవరాజ్‌ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగబోదని, నేరం నిర్ధారణ అయిన వెంటనే దోషులపై చట్టపరమైన చర్యలు చేపడతామని అసెంబ్లీలో వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని