close

తాజా వార్తలు

Updated : 04/12/2020 05:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అర్ధరాత్రి తలుపుతట్టి తండ్రీకూతుళ్లపై దాడి

గొల్లప్రోలు: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి తండ్రీకూతుళ్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన సీతారామయ్య శంఖవరం మండలం నెల్లిపూడి అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి ఎవరో తలుపుకొట్టడంతో .. తలుపుతీసిన ఉపాధ్యాయుడిపై ముఖానికి రంగుపూసుకున్న గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తండ్రిపై దాడిని అడ్డుకున్న కుమార్తె ధనశ్రీపై కూడా దుండగుడు దాడి చేశాడు. సీతారామయ్య భార్య గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులిద్దరూ ప్రస్తుతం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూమి విషయంలో తగాదా నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని