ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ సర్పంచి’
close

ప్రధానాంశాలు

Updated : 06/03/2021 12:03 IST

ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ సర్పంచి’

నిర్మాణానికి అన్ని అనుమతులూ తీసుకున్నా రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ వేధింపులు

ఈనాడు డిజిటల్‌ వికారాబాద్‌, న్యూస్‌టుడే-నార్సింగి, పూడూరు: జిల్లాలో ఉత్తమ సర్పంచిగా గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున అవార్డు తీసుకున్న మన్నెగూడ సర్పంచి తాజాగా భారీ మొత్తం మామూళ్లు గుంజుతూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి హెచ్‌ఎండీఏ నుంచి అన్ని అనుమతులు తీసుకుని దుకాణ సముదాయం నిర్మించుకుంటుండగా, తనకు డబ్బులు ఇవ్వాలంటూ వెంటపడ్డాడు.. చివరకు బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వల పన్నారు. రూ. 13 లక్షలు తీసుకుంటుండగా ఆ సర్పంచిని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ ప్రధాన రోడ్డుపై ముజాహిద్‌ ఆలం ఖాన్‌కు 27 గుంటల భూమి ఉంది. అందులో దుకాణ సముదాయం కట్టుకునేందుకు ఆయన హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకున్నారు. నెల క్రితం పనులు ప్రారంభించారు. తనకు రూ. 20 లక్షలు ఇస్తేనే పనులు చేయనిస్తానంటూ గ్రామ సర్పంచి వినోద్‌గౌడ్‌ వేధిస్తూ పనులను అడ్డుకుంటున్నాడు. అంత ఇచ్చుకోలేమని ముజాహిద్‌ ఆలం ఖాన్‌ వద్ద పనిచేసే సాజిద్‌ పాషా బేరమాడగా, రూ. 13 లక్షలకు ఒప్పుకున్నాడు. శుక్రవారం ఉదయం ఫోన్‌ చేసి ఆ సొమ్ము బండ్లగూడలోని ఆరెమైసమ్మ వద్దకు తీసుకురావాలని సర్పంచి చెప్పాడు. ఆ డబ్బు తీసుకువచ్చి గుడి వద్ద కారులో ఉన్న వినోద్‌కు అందించగా, అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారుల బృందం పట్టుకుని  సొమ్ము స్వాధీనం చేసుకుంది. శనివారం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలిస్తామని డీఎస్పీ  వెల్లడించారు.
నాడు ఉత్తమ సర్పంచి..
వినోద్‌గౌడ్‌ జిల్లాలో ఉత్తమ సర్పంచిగా గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున అప్పటి కలెక్టర్‌ నుంచి అవార్డు తీసుకున్నాడు. ఏసీబీ అధికారుల బృందం సర్పంచిని పట్టుకున్న వెంటనే మరో బృందం మన్నెగూడ పంచాయతీలో సోదాలు నిర్వహించింది. కార్యదర్శి మాణిక్యం, ఇతర సిబ్బందిని విచారించి రికార్డులను పరిశీలించారు. వినోద్‌గౌడ్‌ సర్పంచి అయిన తరువాత పంచాయతీ పరిధిలో ఎన్ని లేఅవుట్లు వచ్చాయి.. ఇతర అభివృద్ధి పనుల్లో ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో విచారిస్తున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన