శ్రీమతీ! ఇదిగో చనిపోతున్నా.. చూశావా!

ప్రధానాంశాలు

Updated : 22/10/2021 07:11 IST

శ్రీమతీ! ఇదిగో చనిపోతున్నా.. చూశావా!

ఫేస్‌బుక్‌లో లైవ్‌ పోస్ట్‌ పెట్టి ఆత్మహత్యాయత్నం

దిల్లీ: ‘మూడేళ్ల కిందట భార్య వదిలి వెళ్లిపోయింది. ఏడాది కిందట ఉద్యోగం కూడా పోయింది. ఇవి చాలక.. చికిత్సకు లొంగని అనారోగ్య సమస్యలు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ఆ వ్యక్తి (43).. భోపాల్‌లో ఉంటున్న భార్యకు గురువారం ఉదయం ఫోను చేసి ఓమారు చూడాలని ఉన్నట్లు తెలిపాడు. ఆమె ససేమిరా అంది. అంతే.. 50 బాటిళ్ల సిరప్‌ తాగేశాడు. అలా తాగుతూ.. తన అత్తింటి వారిపై ఒత్తిడి తెచ్చేందుకు ఫేస్‌బుక్‌లో లైవ్‌ పోస్ట్‌ పెట్టాడు. ఇలా పెట్టడమే అతడి ప్రాణాలు కాపాడింది’ అని దిల్లీ సైబర్‌ సెల్‌ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 1.30కు ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం ప్రారంభించగా.. ఫేస్‌బుక్‌ నిర్వాహకులు వెంటనే ఈ మెయిల్‌ ద్వారా తమను అప్రమత్తం చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ కేపీఎస్‌ మల్హోత్రా తెలిపారు. ఫోన్‌ నంబరు ఆధారంగా ఆ వ్యక్తి దిల్లీలోని రాజౌరీ గార్డెన్‌ ప్రాంతంలో ఉంటున్నట్లు గుర్తించి, 3.15 కల్లా పోలీసులు చిరునామా ఛేదించారు. సగం స్పృహలో ఉన్న బాధితుణ్ని వెంటనే దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన