సేవాభావం అభినందనీయం
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

సేవాభావం అభినందనీయం

నాగేశ్వరరావును సత్కరిస్తున్న ఆర్జేడీ సుబ్బారావు

గుంటూరు విద్య, శావల్యాపురం, న్యూస్‌టుడే: ఆంగ్ల ఉపాధ్యాయుడు బెజవాడ వెంకట నాగేశ్వరరావు సేవాభావం అభినందనీయమని పాఠశాల విద్య ఆర్జేడీ వి.ఎస్‌.సుబ్బారావు అన్నారు. గురువారం ఆర్జేడీ కార్యాలయంలో ఉపాధ్యాయులు బీవీ నాగేశ్వరరావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ సుబ్బారావు మాట్లాడుతూ బెజవాడ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో స్థిరపడిన తన శిష్యులు, బంధు మిత్రులు, ఉపాధ్యాయులు సహకారంతో రూ.26.75 లక్షలు సమీకరించి కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, దివ్యాంగులకు తొమ్మిది విడతలుగా బియ్యం, నిత్యావసరాలు అందజేసి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో ఉర్దూ పాఠశాలల డీఐ షేక్‌ మహమ్మద్‌ ఖాసిం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శావల్యాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పులిపాటి శ్రీనివాసరావు గురువారం పాఠశాల ఆవరణలో మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని