మామిడి కాయల పక్వానికి నిషేధిత పొడి వినియోగం
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మామిడి కాయల పక్వానికి నిషేధిత పొడి వినియోగం

నున్న(విజయవాడ గ్రామీణం), న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా విజయవాడ గ్రామీణ మండలం నున్నలోని మామిడి మార్కెట్‌లో ఆహార భద్రత, ఉద్యాన, రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం గురువారం తనిఖీలు నిర్వహించింది. వీరు మామిడి ఎగుమతులు చేస్తున్న దుకాణాలను పరిశీలించి కాయలు పక్వానికి వచ్చేందుకు నిషేధిత చైనా ఇథలిన్‌ రిపనీర్‌ అనే ఉత్ప్రేరక పౌడరు ప్యాకెట్లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా విభాగ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ...గతంలో మామిడి కాయలు పండించేందుకు మార్కెట్‌లో కార్బైడ్‌ను వాడేవారని, దానిపై నిషేధం ఉండటంతో మూడు సంవత్సరాల నుంచి దీని వినియోగం నిలిపివేశారన్నారు. తాజాగా పురుగుమందుల కంపెనీలకు చెందిన నిషేధిత ఇథలిన్‌ ఉత్ప్రేరక పౌడరు ప్యాకెట్లను వాడుతున్నారన్నారు. ఒక్కో ప్యాకెట్టు 3 గ్రాముల బరువు ఉంటుందని, దీన్ని మామిడి కాయలు ప్యాకింగ్‌ చేసే సందర్భంలో బాక్సులోని కాయల మధ్యలో ఉంచుతున్నట్లు గుర్తించామన్నారు. ఇటువంటివి వాడటం ప్రజారోగ్యానికి విఘాతమన్నారు. ఈ పౌడర్‌ ప్యాకెట్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత వ్యాపారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని