చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించారు: మంత్రి ఆళ్ల నాని
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించారు: మంత్రి ఆళ్ల నాని

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కృష్ణా జిల్లా తిరువూరు అంబులెన్సు విషయంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) మండిపడ్డారు. మృతుడి బంధువుల కోరిక మేరకే 108 సిబ్బంది మృతదేహాన్ని గ్రామ సరిహద్దుల్లో వదిలి పెట్టారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘మంగళవారం ఉదయం తిరువూరు మండలం రాజుగూడెం ప్రభుత్వాసుపత్రి నుంచి 108కి కాల్‌ వచ్చింది. 40 ఏళ్ల సుభాని అనే వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని, తిరువూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కోరారు. సమీపంలోని రెండు అంబులెన్సులు అప్పటికే అత్యవసర సేవల్లో ఉండటంతో జి.కొండూరు నుంచి.. సిబ్బంది అంబులెన్సును పంపారు. తిరువూరు కమ్యూనిటీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు లేకపోవడంతో దగ్గరలో ఉన్న అమరావతి ఆసుపత్రికి ఉదయం 11.28కి తరలించారు. అప్పటికే సుభాని మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. తాము పేదవాళ్లమని మృతదేహాన్ని తరలించే స్తోమత లేదని గ్రామ సరిహద్దుల్లో ఉన్న అంత్యక్రియలు జరిపే ప్రదేశానికి సమీపంలో మృతదేహాన్ని వదిలి పెట్టాలని 108 సిబ్బందిని మృతుడి బంధువులు కోరారు. ఈ మేరకు వారు 108 సిబ్బందికి లేఖ రాసి ఇచ్చారు. బంధువులు కోరిన విధంగా 108 సిబ్బంది చేశారు. అయినా.. మృతదేహాన్ని విడిచే విషయంలో ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు పాటించకపోవడంతో సిబ్బందిని వెంటనే సస్పెండ్‌ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలిచ్చారు’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజల్ని తప్పుదోప వట్టిస్తున్నారని దుయ్యబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని