300 కిలోల గంజాయి స్వాధీనం
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

300 కిలోల గంజాయి స్వాధీనం

కంచికచర్ల, న్యూస్‌టుడే: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు క్రేన్‌లో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్‌ బ్రాంచి ఎస్సై మురళీకృష్ణ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి క్రేన్‌లో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెంబడించి కీసర సమీపంలో పట్టుకున్నారు. క్రేన్‌లో ఉన్న 150 గంజాయి పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. సరకును కంచికచర్ల పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని