రూ.5 లక్షలిచ్చి చేతులు దులిపేసుకోవడం దారుణం
logo
Published : 23/06/2021 06:12 IST

రూ.5 లక్షలిచ్చి చేతులు దులిపేసుకోవడం దారుణం

తాడేపల్లి: మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, వారిపై అఘాయిత్యం జరిగితే రూ.5 లక్షలు చేతికిచ్చి చేతులు దులిపేసుకోవడం సిగ్గుమాలిన చర్య అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. సీతానగరంలో యువతిపై అఘాయిత్యం జరిగిన ప్రదేశాన్ని ఆమె జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, తెలుగు మహిళ గుంటూరు పార్లమెంటు అధ్యక్షురాలు జయలక్ష్మి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరంజీవి, తెదేపా తాడేపల్లి పట్టణాధ్యక్షుడు సాంబశివరావుతో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం, డీజీపీలు ఉండే ప్రాంతంలో గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు ఎక్కువయ్యాయని చెప్పడానికి సిగ్గుపడాలన్నారు. అమరావతి రైతుల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించడానికి బదులు ఇలాంటి ప్రాంతాల్లో నిఘా ఉంచితే గంజాయి, బ్లేడు బ్యాచ్‌లు ఉండేవి కాదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని