‘మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం చెలగాటం’
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

‘మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం చెలగాటం’

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఒప్పంద, పొరుగుసేవల కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సుబ్బారావు, ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టిన వెంటనే రెగ్యులర్‌ చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, అసెంబ్లీలో సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు ఆ హామీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 4వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమించాలని, కార్పొరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు, ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు ఇవ్వాలని, రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డేవిడ్‌, రాష్ట్ర నాయకులు సామ్రాజ్యం, వి.మార్తమ్మ, కె.శ్రీనివాసరావు, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి బొత్సకు వినతి: సమావేశం అనంతరం నాయకులంతా మున్సిపల్‌ ఒప్పంద కార్మికులను ఆప్కాస్‌ నుంచి మినహాయించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. బొత్స సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని