ట్రాలీ ఆటో బోల్తా
eenadu telugu news
Published : 19/09/2021 02:10 IST

ట్రాలీ ఆటో బోల్తా

ఏడుగురికి గాయాలు

రోదిస్తున్న క్షతగాత్రులు

నకరికల్లు, న్యూస్‌టుడే: అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై నకరికల్లు కూడలి వద్ద శనివారం రాత్రి కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని త్రిపురాపురం గ్రామానికి చెందిన 30 మంది కూలీలు చల్లగుండ్లలో వరి నాట్లు వేసి తిరిగి ట్రాలీ ఆటోలో స్వస్థలానికి వెళ్తున్నారు. నకరికల్లు కూడలి వద్ద కారు ఢీకొని ద్విచక్ర వాహనం పడిపోయింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళా కూలీలు హాహాకారాలు పెట్టారు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే బోల్తా పడిన ఆటోను పైకి లేపారు. టి.వెంకట్రావు, టి.అంకమ్మ, జిగురు దుర్గ, టి.నాగలీలవేణి, సీహెచ్‌ పార్వతి, టి.రాజశ్వేరిలను 108 వాహనంలో నరసరావుపేట ఏరియా ఆసుపత్రి, ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మిగిలిన కూలీలను మరో ఆటోలో త్రిపురాపురం పంపించారు. మహిళా కూలీల రోదనలతో ఘటనా స్థలంలో ఆందోళన నెలకొంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని