52 పరుగుల ఆధిక్యంతో ఎక్స్‌ సెన్స్‌ జట్టు విజయం
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

52 పరుగుల ఆధిక్యంతో ఎక్స్‌ సెన్స్‌ జట్టు విజయం


మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బహుమతితో వెంకట్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: గోస్పోర్ట్స్‌ క్రికెట్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న బెజవాడ వైట్‌బాల్‌ టీ-20 క్రికెట్‌ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎక్స్‌ సెన్స్‌ జట్టు 52 పరుగుల ఆధిక్యంతో లియో సీసీ జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచిన లియో సీసీ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఎక్స్‌ సెన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 104 పరుగులు చేసింది. జట్టులో పీకే శ్రీచక్రి 16 పరుగులతో క్రీజ్‌లో నిలవగా.. నవ్‌నీత్‌ సింగ్‌ 23, వెంకట్‌ 11 పరుగులతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లు ఇ.సురేష్‌ నాలుగు, రామ్‌ నాని మూడు వికెట్లు కూల్చారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన లియో సీసీ జట్టు 18.2 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి బౌలర్లు శ్రీనాథ్‌ మూడు వికెట్లు కూల్చగా.. నవ్‌నీత్‌ సింగ్‌, వెంకట్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఎక్స్‌ సెన్స్‌ జట్టుకు చెందిన వెంకట్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికై బహుమతి కైవసం చేసుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని