జాతీయ అథ్లెటిక్స్‌ విజేతకు అభినందనలు
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

జాతీయ అథ్లెటిక్స్‌ విజేతకు అభినందనలు


నరేష్‌కుమార్‌ను సన్మానించిన రాష్ట్ర అథ్లెటిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి హైమ తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: వరంగల్‌లో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగిన 60వ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన కె.నరేష్‌ కుమార్‌(కర్నూల్‌)ను సోమవారం రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సన్మానించింది. నరేష్‌ కుమార్‌ 100 మీటర్ల పరుగులో ఈ పతకంతో పాటు నూతన మీట్‌ రికార్డు(10.3 సెకన్లు) నెలకొల్పాడని రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల హైమ పేర్కొన్నారు. మరో అథ్లెట్‌ ఎన్‌.షణ్ముగ శ్రీనివాస్‌ 200 మీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడని వివరించారు. కొవిడ్‌-19 కారణంగా రెండేళ్ల విరామం తర్వాత రాష్ట్ర అథ్లెట్లు పతకాలు సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం చీఫ్‌ కోచ్‌ ఎన్‌.వంశీధర్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని