కాపలాదారుడినంటూ కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు
eenadu telugu news
Published : 21/09/2021 04:04 IST

కాపలాదారుడినంటూ కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల


గుంటూరు అరండల్‌పేట మెయిన్‌ రోడ్డులో నినదిస్తున్న సీపీఐ నాయకులు

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరు ఎండగట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ప్రారంభమైన ‘సీపీఐ జన ఆందోళన్‌’ ప్రచార యాత్ర సోమవారం గుంటూరుకు చేరుకుంది. ముందుగా లాడ్జి కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని శంకర్‌విలాస్‌, మార్కెట్‌ కూడలి, జిన్నాటవర్‌, పాతబస్టాండ్‌, స్టేడియం మీదుగా పెదకాకాని రోడ్డులోని మల్లయ్యలింగం స్తూపం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నిరంతరం తనకు తాను ఛాయ్‌వాలాగా సంబోధించుకునే ప్రధాని మోదీకి ఈ దేశంలో నిరుపేదలు, అన్నదాతలు, కార్మికుల సమస్యలు కనిపించడం లేదా అని మండిపడ్డారు. దేశానికి కాపాలదారుడిని అని చెప్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ఏఐటీయూసీ ప్రదాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మికులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి, ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌, కమిటీ సభ్యులు మారుతి వరప్రసాద్‌, ఎస్‌కే హుస్సేన్‌, వివిధ కార్మిక విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని