జాషువా సాంస్కృతికోత్సవాలు ప్రారంభం
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

జాషువా సాంస్కృతికోత్సవాలు ప్రారంభం


ఆర్ట్‌ గ్యాలరీ తిలకిస్తున్న మల్లికార్జునరావు, నిర్వాహకులు

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : నగరంలోని బాలోత్సవ్‌ భవన్‌లో మహాకవి జాషువా సాంస్కృతిక ఉత్సవాలను మంగళవారం ప్రారంభించారు. తొలి రోజు ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అలాగే గురజాడ అప్పారావు 159 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి బాలోత్సవమ్‌ కమిటీ గౌరవ అధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు మాట్లాడుతూ.. మహాకవి గురజాడ అప్పారావు రచనలు ఆదర్శమని, ఆయన మాటలు ఇప్పటి జీవన విధానానికీ వర్తింపజేసుకోవచ్చని పేర్కొన్నారు. పిల్లల్లో సమాజంపై అవగాహన కల్పించేందుకు, సృజనాత్మకత పెంపుదలకు చిత్ర లేఖన పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. ఆర్ట్‌ గ్యాలరీని తిలకించి, నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఫోరమ్‌ ఆర్ట్స్‌ నిర్వాహకులు ఎ.సునీల్‌ కుమార్‌, ప్రస్థానం పత్రికా ఎడిటర్‌ సత్యాజీ, ప్రముఖ చిత్రకారుడు టి.వెంకటేశ్వరరావు, గిరిధర్‌, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ గాదె సుబ్బారెడ్డి, నిర్వాహకులు గుండు నారాయణరెడ్డి, సి.ఆర్‌.రావు, రాజు, అమరావతి బాలోత్సవం కన్వీనర్‌ పిన్నమనేని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని