అయ్యన్నపాత్రుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
eenadu telugu news
Updated : 24/09/2021 12:03 IST

అయ్యన్నపాత్రుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

నకరికల్లు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నకరికల్లు పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 188 కొవిడ్‌-19 నిబంధనల ఉల్లంఘన, సెక్షన్‌ 270 వ్యాధి విస్తరణకు పాల్పడుతున్నారని, సెక్షన్‌ 504 ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అవమానించడం, సెక్షన్‌ 505(2) వదంతులు వ్యాప్తి చేసి వ్యక్తి పరువుకు నష్టం కలిగిస్తున్నారని, సెక్షన్‌ 509 మహిళలను కించపరచడం, 51(బీ) ప్రభుత్వ అధికారులను ప్రత్యేకంగా కించపరచడం, డీఎంఏ-2005 విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ఉల్లంఘన, వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను గురువారం తెదేపా, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు మంగళగిరి తెదేపా కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసి అందజేశారు. చంద్రబాబును కలిసిన వారిలో నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి డాక్టరు చదలవాడ అరవిందబాబు, న్యాయవాదులు షేక్‌ ఆలీబాషా, కె.సీతారామాంజనేయులు, జి.సురేష్‌బాబు, రావెల లక్ష్మీనారాయణ, జీవీ సుబ్బారావు, ఏడుకొండలు, కన్నారావు, కోటినాగయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని