భవానీలకు కేశఖండనశాల, ఘాట్ల వద్ద ఏర్పాట్లు
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

భవానీలకు కేశఖండనశాల, ఘాట్ల వద్ద ఏర్పాట్లు

వివరాలు అడిగి తెలుసుకుంటున్న పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయడు, ఈఓ భ్రమరాంబ

ఇంద్రకీలాద్రి, విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : భవానీ దీక్షాధారులకు కేశఖండన శాల, ఘాట్ల వద్ద ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు అన్నారు. రానున్న మూడు రోజులు భవానీలు పెద్ద ఎత్తున దుర్గమ్మ దర్శనానికి రానుండటంతో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ క్షేత్రస్థాయిలో కేశఖండన శాల, ఘాట్ల వద్ద పరిస్థితిని గురువారం పరిశీలించారు. ఇంజినీరింగ్‌ అధికారులకు కేశఖండన శాల పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. భవానీ దీక్షల విరమణకు ఎటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం లేనందున వచ్చిన వారు తలనీలాలు సమర్పించి, ఘాట్ల వద్ద స్నానాలు చేసిన తరువాత అమ్మవారి దర్శనానికి వస్తారన్నారు. వారికి దర్శనానికి, లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేయాలని అన్నారు. క్యూలైను బారికేడ్లు పటిష్ఠం చేయాలన్నారు. డీఈ రమాదేవి, ఏఈవో రమేష్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని