రైతు భరోసా కేంద్రాలపై కేరళ అధ్యయనం
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

రైతు భరోసా కేంద్రాలపై కేరళ అధ్యయనం


మంత్రి ప్రసాద్‌కు కియోస్క్‌ పని తీరును వివరిస్తున్న అధికారులు

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాలను కేరళలోనూ ఏర్పాటు చేసేందుకు తమ బృందం అధ్యయనం చేస్తోందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ తెలిపారు. ఆదివారం తుక్కులూరులోని రైతు భరోసా కేంద్రాన్ని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల బృందంతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను గుజరాత్‌ అధికారులు పరిశీలించి వారి రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధర లభించే అంశంపై కూడా తమ బృందం అధ్యయనం చేస్తోందన్నారు. ఆరోగ్యకరమైన వంగడాల ఉత్పత్తి, ప్రకృతి వ్యవసాయం తదితరాలను పరిశీలించి తమ రాష్ట్రంలోను అమలు చేస్తామన్నారు. అందుకు అవసరమైన సాంకేతిక సహాయన్ని ఏపీ ప్రభుత్వ అధికారుల నుంచి తీసుకుంటామని చెప్పారు. ఏపీ కమిషనర్‌ కార్యాలయ జేడీ శ్రీధర్‌ రైతు భరోసా కేంద్రాల పని తీరు, కియోస్క్‌ల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కేరళ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఎస్‌ఎం.విజయానంద్‌, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ సుభాష్‌, అగ్రికల్చర్‌ ప్లానింగ్‌ బోర్డు సభ్యులు ఎస్‌ఎస్‌.నగేష్‌, ఉప సంచాలకులు ఎం.ఎస్‌.ప్రమోద్‌కుమార్‌, కేఎస్‌ ప్రతాప్‌, టి.వినోద్‌మోహన్‌, టి.విజయ్‌కుమార్‌, కృష్ణా జేడీ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని