ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

ఈడుపుగల్లు (కంకిపాడు గ్రామీణం), న్యూస్‌టుడే : అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని ఈడుపుగల్లు పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పుట్టకట్టపై నివసించే షేక్‌ బాషా అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు హుస్సేన్‌బుడే విజయవాడలోని ఓ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు మరో కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం చిన్న కుమారుడు కళాశాలకు వెళ్లగా పెద్ద కుమారుడు హుస్సేన్‌బుడే ఇంట్లోనే ఉన్నాడు. తల్లిదండ్రులు అడగ్గా తరువాత వెళ్తానని చెప్పాడు. మధ్యాహ్నం అతని తమ్ముడు కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. తలుపులు ఎంతసేపటికీ తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సోదరుడు ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపులు పగులకొట్టి హుస్సేన్‌బుడే (18)ను కిందకు దించి కంకిపాడు సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కంకిపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని