న్యాయమూర్తులపై దూషణ కేసులో మరొకరికి రిమాండు
eenadu telugu news
Published : 24/10/2021 05:53 IST

న్యాయమూర్తులపై దూషణ కేసులో మరొకరికి రిమాండు

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టిన కేసులో సీబీఐ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి ఐదుగురిని శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా, మరో నిందితుడు దిరిశ కిషోర్‌రెడ్డిని శనివారం కోర్టులో హాజరు పరిచారు. కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కిషోర్‌రెడ్డి న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులను వక్రీకరిస్తూ వారిని, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో 13 పోస్టింగ్‌లు పెట్టారు. అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 11 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా వారిలో విచారణ పూర్తయిన నిందితులకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. శనివారం హాజరుపరిచిన కిషోర్‌రెడ్డిని నవంబర్‌ 3 వరకు రిమాండ్‌ విధిస్తూ గుంటూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి పొన్నూరు బుజ్జి ఉత్తర్వులు జారీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని