బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన
eenadu telugu news
Published : 24/10/2021 06:05 IST

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతుల 31 బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీ కోసం షెడ్యూల్‌ను జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు డి.మధుసూదనరావు శనివారం విడుదల చేశారు. రివైజ్డ్‌ ప్రొవిజినల్‌ ప్రతిభా జాబితా ఈనెల 25న, ఆఖరి మెరిట్‌ లిస్ట్‌ 1:3 చొప్పున 26న ప్రచురిస్తారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌ 4వ వీధిలోని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం నోటీస్‌ బోర్డు మీద అంటిస్తారన్నారు. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ www.guntur.ap.gov.in లో ఏర్పాటు చేస్తామన్నారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లోని అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం 29న నిర్వహిస్తామన్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్‌ మెరిట్‌ లిస్టులోని అభ్యర్థులకు నవంబరు 1న కంప్యూటర్స్‌, అసోసియేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ పరీక్షను డీఐవో ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని