అన్ని వర్గాలు ఆకట్టుకునేలా బాల సాహిత్యం
eenadu telugu news
Published : 26/10/2021 04:25 IST

అన్ని వర్గాలు ఆకట్టుకునేలా బాల సాహిత్యం

పుస్తకావిష్కరణలో శివారెడ్డి, సాంబశివరావు, సుబ్రహ్మణ్యభట్టు, మానవేంద్ర తదితరులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : ‘బాలల మంచి కథలు’ పుస్తకంలో 1950 తర్వాత కథలు మాత్రమే ఉన్నాయని, చందమామ కథలు, నీతి కథలు వంటివి అన్ని వయస్కుల వారినీ ఆకట్టుకుంటాయని తెలుగు భాష సలహా మండలి, సాహిత్య అకాడమీ  సంచాలకుడు కె.శివారెడ్డి అన్నారు. సోమవారం సాహిత్య అకాడమీ, విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో దివంగత వెలగా వెంకటప్పయ్య సంపాదకత్వంలో తెలుగు అకాడమీ ప్రచురించిన ‘బాలల మంచి కథలు’ పుస్తకావిష్కరణను విజయవాడ బుక్‌ఫెస్టివల్‌ సొసైటీ ఆవరణలో నిర్వహించారు. తొలుత రచయిత రావెల సాంబశివరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీవేత్త పన్నాల సుబ్రహ్మణ్యభట్టు అధ్యక్షత వహించారు. శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకంలో కాల్పనిక సాహిత్యం, సాంఘిక కథలు, అద్భుత కథలు ఉన్నాయన్నారు. నీతి కథలకు పెద్దపీట వేశారని కొనియడారు. పిల్లలు ఇష్టంగా చదువుతారని చెప్పారు. నేడు కథలు, సాహిత్యం చదివే వారు తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రావెల సాంబశివరావు మాట్లాడుతూ.. ఆకాశవాణికి, బాల సాహిత్యానికి విడదీయారని బంధం ఉందన్నారు. రేడియో అన్నయ్య వంటి కార్యక్రమాలు ఆకాశవాణిలో మంచి ఆదరణ పొందాయని గుర్తుచేశారు. బీవీ రచించిన బాలామణి పుస్తకానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభించిందన్నారు. వెలగా వెంకటప్పయ్య కుమారుడు, సాహితీవేత్త మానవేంద్ర, రచయిత బాలాంత్రపు ప్రసూన, బాల సాహిత్యవేత్త అలపర్తి వెంకటసుబ్బారావు, బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి ఎస్‌.వెంకటనారాయణ, బుక్‌ ఫెస్టివల్‌ మాజీ అధ్యక్షుడు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని