పురపాలక కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

పురపాలక కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో విషజ్వరాలు, మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ తదితర వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇందుకు కారణమవుతున్న పురపాలక సంఘ కమిషనర్‌ పి.శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని బుధవారం పట్టణ ఇన్‌ఛార్జ్‌ సీఐ నరసింహారెడ్డికి ఫిర్యాదు అందింది. ఈమేరకు స్థానిక వావిలాల ప్రజ్వలన సేవాసంస్థ బాధ్యులు బండి పూర్ణచంద్రరావు, జీవీ నారాయణ, కె.గోపిలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 20వ వార్డుకు చెందిన ఏడేళ్ల బాలుడు బండారుపల్లి కార్తీక్‌ జ్వరంతో మృతి చెందాడని, దీనికి కమిషనర్‌ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై కమిషనర్‌ శ్రీనివాసరావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా పట్టణంలోని అన్ని వార్డుల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాలుడు కార్తీక్‌ మృతికి టైఫాయిడ్‌ కారణమన్నారు. వ్యాధులు ప్రబలకుండా, ప్రబలిన చోట స్వచ్ఛత చర్యలు చేపట్టడంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపట్లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారితో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని