ఎత్తులు చిత్తు.. ఎర్రచందనం డంప్‌ సా్వధీనం
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

ఎత్తులు చిత్తు.. ఎర్రచందనం డంప్‌ సా్వధీనం


ఎర్రదుంగలను పరిశీలిస్తున్న సుందరరావు

జీవకోన (తిరుపతి),న్యూస్‌టుడే: శేషాచలం అడవుల నుంచి సేకరించిన దుంగలను తరలించేందుకు స్మగ్లర్లు వేసిన ఎత్తులను చిత్తుచేశామని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ మేడా సుందరరావు అన్నారు. తిరుపతిలోని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రేణిగుంట మండలం చైతన్యపురం అటవీ ప్రాంతంలో ఇటీవల సీఐ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ కృపానంద, ఆర్‌ఎస్సైలు పి.లక్ష్మణ్‌, జి.వి.కుమార్‌ బృందం నిర్వహించిన దాడుల్లో ప్రకాశం జిల్లా చిన్నారి కోట్లకు చెందిన కూకట్ల రమేష్‌రెడ్డి ఐదు ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డాడని అన్నారు. అతడిని విచారించగా.. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజలపల్లికి చెందిన పుల్లారెడ్డి అనే వ్యక్తి పంపగా వచ్చానని చెప్పాడన్నారు. పుల్లారెడ్డిని అదుపులోనికి తీసుకుని విచారించామన్నారు. గత కొన్ని రోజులుగా శేషాచలం అడవుల నుంచి సేకరించిన 35 ఎర్రచందనం దుంగలను ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం చెనారికట్ల వద్ద దాచిపెట్టినట్టు తెలిపాడన్నారు. అతని సమాచారం మేరకు సంబంధిత గ్రామానికి వెళ్లి పరిశీలించి.. 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలన్నీ ఏ గ్రేడ్‌నకు చెందినవని, 1707 కిలోల బరువు ఉన్నాయని చెప్పారు. స్మగ్లింగ్‌ వెనుక ఉన్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. సమావేశంలో సీఐలు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్‌, వెంకట్‌రవి, ఎఫ్‌ఆర్వో ప్రేమ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని