జిల్లా జడ్జిగా పార్థసారథి
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

జిల్లా జడ్జిగా పార్థసారథి

 

చిత్తూరు (న్యాయవిభాగం): జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వి.రవీంద్రబాబు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మదనపల్లెలోని రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.వి.ఎస్‌.బి.జి.పార్థ.సారథిఫ నూతన జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

పలువురు న్యాయమూర్తుల బదిలీ

జిల్లాలో పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చిత్తూరులోని తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.వి.ఎస్‌.సూర్యనారాయణమూర్తి గుంటూరు ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు. జిల్లాలోని పలువురు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తులకు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. చిత్తూరు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఆర్‌.శైలజను గుంటూరులోని అయిదో అదనపు జిల్లా కోర్టుకు, మదనపల్లె ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి యు.ఇందిర ప్రియదర్శిని విజయవాడ ఫ్యామిలీ కోర్టుకు, శ్రీకాళహస్తి సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి గురునాధ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టుకు, కడప జిల్లా ప్రొద్దుటూరు సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మిని చిత్తూరు ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని