26న ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

26న ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష


ప్రశ్నపత్రాల వాహనానికి వేసిన సీల్‌ను పరిశీలిస్తున్న విద్యాశాఖ ఏసీ ప్రభావతి, పోలీసులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష ఈ నెల 26న నిర్వహించనున్నారు. జిల్లాలో 42 కేంద్రాల్లో 5,802 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రధాన పర్యవేక్షకులు, శాఖాధికారులు, 272 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఆయా ప్రశ్నపత్రాలు పోలీసు బందోబస్తు నడుమ గురువారం నగరంలోని పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌కు చేరాయి. వీటిని విద్యాశాఖ పరీక్షల సహాయ కమిషనర్‌ (ఏసీ) ప్రభావతి ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించి ఆపై సంబంధిత కేంద్రాల పరిధిలోని పోలీసుస్టేషన్లకు తరలించారు. వీటిని పరీక్ష రోజున ఆయా కేంద్రాల అధికారులకు అందజేస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని