1,897కుటుంబాలకుఊరట..!
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

1,897కుటుంబాలకుఊరట..!

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: కరోనా కరాళ నృత్యంతో ఆప్తులను కోల్పోయిన వారికి చేయూతనిచ్చేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం జిల్లాలోని 1,897 కుటుంబాలకు ఊరట ఇవ్వనుంది. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల వంతున చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొనడంతో భరోసా ఇచ్చినట్లయింది. అధికారిక లెక్కల ప్రకారం ఏడాదిన్నర కాలంగా జిల్లాలో 2,38,871 మంది కరోనా బారినపడగా 1,897 మంది కన్నుమూశారు. గతంలో మృతుల కుటుంబాల్లో కొందరు మరణ ధ్రువీకరణ పత్రం కోసం ప్రయత్నించగా చాలా మందికి కొవిడ్‌ కారణంగా.. అనే విషయాన్ని ప్రస్తావించకుండా జారీ చేశారు. ఇప్పటికీ చాలా వరకు మరణ ధ్రువీకరణ పత్రాలు జారీకాని పరిస్థితి నెలకొంది. జిల్లా స్థాయిలో కలెక్టరు, డీఎంహెచ్‌వో, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, మరో నిపుణుడు సభ్యులుగా ఉండే కమిటీ పత్రాలను పరిశీలించి పరిహారం అందించే చర్యలు తీసుకుంటాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని