ఉద్యోగాలు ఇప్పిస్తామనేవారిని నమ్మొద్దు
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామనేవారిని నమ్మొద్దు


మాట్లాడుతున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, హోంగార్డు పోస్టులు ఇప్పిస్తామని చెప్పేవారి మాటలు నమ్మవద్దని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలన్నీ ప్రభుత్వ మార్గదర్శకాల ద్వారానే వస్తాయని, ఎవరూ నగదు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో ఉద్యోగాల పేరిట మోసపోయిన వారే అధికంగా ఉన్నారన్నారు.జిల్లాలో హోంగార్డు పోస్టుల భర్తీ జరగడం లేదని, ఎవరూ మోసపోవద్దన్నారు. ఎవరైనా మాయమాటలు చెబితే వెంటనే డయల్‌-100 లేక పోలీసు వాట్పప్‌ నంబరు 94409 00005కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని