గో సమ్మేళనం విజయవంతానికి కృషి
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

గో సమ్మేళనం విజయవంతానికి కృషి


అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జేఈవో వీరబ్రహ్మం

తిరుపతి(తితిదే): గోశాల నిర్వహణ, గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 30, 31 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న గో సమ్మేళనం విజయవంతానికి అధికారులు కృషి చేయాలని తితిదే జేఈవో వీరబ్రహ్మం పిలుపునిచ్చారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సోమవారం కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గో సమ్మేళనానికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేశామని, ఇప్పటినుంచి ముందస్తు ఏర్పాట్లకు సిద్ధం కావాలన్నారు. మొదటి రోజు వెయ్యి మంది, రెండో రోజు వెయ్యి మంది రైతులు వస్తారని, వీరందరికీ తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి 2, 3 సత్రాలు, ఎస్వీ విశ్రాంతి గృహం తదితర ప్రాంతాల్లో బస ఏర్పాటు చేయాలన్నారు. యుగ తులసీ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శివకుమార్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్‌ అధికారి విజయసారథి, ఎస్వీ గోశాల సంచాలకుడు హరనాథరెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని