Published : 27/07/2021 06:01 IST

1.90 లక్షల మందికి టీకా

జగ్గంపేట మండలం మల్లిసాలలో వ్యాక్సినేషన్‌

కాకినాడ వైద్యం: జిల్లాలో సోమవారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 45 ఏళ్లు నిండిన వారు, గర్భిణులు, ఉపాధ్యాయులకు 2 లక్షల డోసులు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 296 కేంద్రాల్లో 1,90,850 మందికి టీకాలు వేశామని డీఎంహెచ్‌వో గౌరీశ్వరరావు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రోగ్రాం ఆఫీసర్లు, డివిజనల్‌ అధికారులు పర్యవేక్షించారన్నారు. మిగిలిన డోసులను మంగళవారం అన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 45 ఏళ్లు నిండినవారికి వేస్తామని చెప్పారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని