శునకానికీ జ్వరమొచ్చింది... 
eenadu telugu news
Updated : 20/09/2021 11:23 IST

శునకానికీ జ్వరమొచ్చింది... 


పచ్చకామెర్లు బారినపడ్డ కుక్కకు చికిత్స

 

శ్యామలాసెంటర్‌(రాజమహేంద్రవరం): మనుషులే కాదు... శునకాలూ సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నాయి. పచ్చకామెర్లు, రక్త విరేచనాలు, జ్వరాలు, చిన్నచిన్న రుగ్మతలతో బాధపడుతున్న శునకాలను ఆదివారం రాజమహేంద్రవరం పశువుల వైద్యశాలకు పెంపకందారులు తీసుకొచ్చి వైద్యం చేయించారు. గతంలో 60 నుంచి 70 కేసులు వచ్చేవని, ప్రస్తుతం నిత్యం 120 వరకు పైగా శునకాలను వైద్యం నిమిత్తం తీసుకు వస్తున్నారని డాక్టర్‌ యోగానంద్‌ తెలిపారు. సాధారణంగా పశు వైద్యశాలలో గేదెలు, మేకలు, ఆవులకు ఉచితంగా వైద్యం అందించి, మందులు ఇస్తారు. ఈ ఆసుపత్రి నగర వాతావరణంతో ఉండటం వల్ల పశువులు కంటే శునకాలు అధికంగా వస్తున్నాయి. వాటి వ్యాధులకు తగ్గట్టుగా మందులు సరఫరా ఉండటం లేదని పెంపకందారులు వాపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని