సమర్థంగా కేంద్ర పథకాల అమలు
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

సమర్థంగా కేంద్ర పథకాల అమలు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయాలని కాకినాడ ఎంపీ, దిశ కమిటీ ఛైర్‌పర్సన్‌ వంగా గీత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో దిశ(డిస్ట్రిక్ట్‌ ఇనీషియేటివ్‌, సెల్ఫ్‌ రిలయన్స్‌, హ్యూమన్‌ అడ్వాన్స్‌మెంట్‌) జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ కేంద్రం సాయంతో జిల్లాలో అమలయ్యే పథకాల ప్రగతిని సమీక్షించి సూచనలు చేశారు. ఉపాధి హామీపై డ్వామా పీడీ వెంకటలక్ష్మి వివరించారు. జిల్లాలో చెరువుల అభివృద్ధికి ప్రతిపాదించాలని ఎంపీ సుభాష్‌చంద్రబోస్‌ సూచించారు. వ్యవసాయానికి ఉపాధి పథకం అనుసంధానంతో రబ్బరు, కాఫీ తోటల విస్తరణకు దోహదపడిందని రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. సచివాలయ వ్యవస్థలో ఉన్న ఇంజినీర్లను గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టేందుకు సూక్ష్మ ప్రణాళికల తయారీకి వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించేలా ప్రతిపాదించాలని ఎంపీ అనురాధ, అవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలను కాపాడాలని ఎంపీ మాధవి సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ హరికిరణ్‌, జేసీలు కీర్తి, భార్గవ్‌తేజ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని