దాతృత్వంతో ఊపిరి
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

దాతృత్వంతో ఊపిరి


కలెక్టర్‌ సమక్షంలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సామగ్రిని అందజేస్తున్న ఓఎన్జీసీ ప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్‌: విశాఖపట్నానికి చెందిన ఇమ్మాన్యుయేల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు సహకారంతో ఓఎన్‌జీసీ జిల్లాకు రూ.4.37 కోట్ల విలువైన వైద్య సామగ్రిని గురువారం కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు అందజేసింది. 25 ఆటోమేటిక్‌ వెంటిలేటర్లు, 1,385 ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లతో పాటు మూడు రకాల ఆక్సిజన్‌ సిలిండర్లను రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పార్లమెంట్‌ సభ్యులు వంగా గీత, చింతా అనురాధ, జి.మాధవి సమక్షంలో కలెక్టర్‌కు అందించారు. కొవిడ్‌ సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇంత పెద్ద ఎత్తున వితరణ చేసిన ఓఎన్జీసీ ప్రతినిధులను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో జేసీ కీర్తి, ఓఎన్జీసీ ప్రతినిధులు కె.రాజేశ్‌, ఎ.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని