‘కవి సామ్రాట్‌లో నటించడం నా అదృష్టం’
eenadu telugu news
Updated : 18/10/2021 11:45 IST

‘కవి సామ్రాట్‌లో నటించడం నా అదృష్టం’


సభ్యులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న సినీ నటుడు ఎల్‌బీ శ్రీరాం

గాంధీనగర్‌: తొలి తెలుగు జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన కవి సమ్రాట్‌ డాక్యుమెంటరీ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని రచయిత, నటుడు ఎల్‌బీ శ్రీరాం అన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దంటు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ఆ చిత్ర ప్రిప్యూను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ప్రతిభను ప్రోత్సహిస్తానన్నారు. సభాధ్యక్షుడు లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ ఎం.విశ్వేశ్వరరావు, పూర్వపు గవర్నర్‌ బాదం బాలకృష్ణ, మంగతాయారు, సూర్యనారాయణ, కృష్ణప్రకాష్‌, మార్ని జానకిరామ్‌ చౌదరి తదితరులు మాట్లాడారు. క్లబ్‌ తరఫున సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలను ఎల్‌బీ శ్రీరాం అందజేశారు. అనంతరం చిత్ర బృందాన్ని సన్మానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని