వైభవం.. వేంకటేశ్వరుని కల్యాణం
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

వైభవం.. వేంకటేశ్వరుని కల్యాణం


వేడుక నిర్వహిస్తున్న అర్చకులు

వాడపల్లి(ఆత్రేయపురం): వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వివిధ రుసుంల ద్వారా రూ.1.20 లక్షల ఆదాయం వచ్చింది.

లక్ష మంది తిలకించేలా..

వాడపల్లి వేంకటేశ్వరుని కల్యాణ వేదిక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని నిర్మాణం కోసం ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రహదారుల భవనాలశాఖ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ రూ.54 లక్షల విరాళం అందజేసింది. అసోసియేషన్‌ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డి, తాతారెడ్డి పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒకేసారి లక్ష మంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేదికను స్వామివారి వార్షిక తీర్థ కల్యాణోత్సవాల నాటికి పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ ర.భ. కాంటాక్టర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు ముందుకు వచ్చి కల్యాణ వేదిక నిర్మించడం అభినందనీయమన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని