‘సంక్షోభంలో వ్యవసాయ రంగం’
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

‘సంక్షోభంలో వ్యవసాయ రంగం’


మాట్లాడుతున్న మరెడ్రి శ్రీనివాసరెడ్డి, పక్కన గోరంట్ల, నల్లమిల్లి తదితరులు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల తెదేపా రైతు విభాగం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు విత్తకముందే అన్ని సమకూరుస్తామని, పంటకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన సీఎం జగన్‌, ఇప్పటికి అయిదు పంట సీజన్లు పూర్తయినా రైతులకు ఎటువంటి కొనుగోలు ధరను నిర్ణయించలేదన్నారు. పదిహేను రోజులుగా పొటాషియం దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్డు డెడ్‌ స్టోరేజీ కింద లిఫ్ట్‌ పెట్టి ఎత్తిపోతలు పెడితే గోదావరి డెల్టాలో రెండో పంటకు నీరు ఉండదన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో పంటకు డబ్బులు ఇవ్వకపోగా, విద్యుత్తు మీటర్లు వేస్తానని చెప్పడం దారుణమన్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గడిచిన రబీలో ఉభయ గోదావరి జిల్లాల్లో 3,500 కోట్లు ధాన్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పొటాషియం బస్తా రూ.600 ఉంటే, ప్రస్తుతం రూ.1,100 పలకడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు కెఎస్‌ జవహర్‌, సిరిసపల్లి నాగేశ్వరరావు, ఆళ్ల గోవింద్‌, వెలుగుబంటి ప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని