18 ఏళ్లు నిండిన వారికి టీకా ఇచ్చేలా..
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

18 ఏళ్లు నిండిన వారికి టీకా ఇచ్చేలా..

ఈనాడు, అమరావతి కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం అర్హులందరికీ వ్యాక్సిన్‌ వేయడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నారు. మంగళవారం, శనివారం మెగా డ్రైవ్‌ నిర్వహించి వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొందరు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వివిధ కారణాలతో ముందుకు రావడం లేదు. కరోనా తగ్గినందున మళ్లీ విస్తరిస్తే వేసుకుందామన్న ఆలోచనతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉన్న యువత ఎక్కువగా టీకా ప్రక్రియలో పాల్గొనడం లేదు. కొందరైతే వ్యాక్సిన్‌ వేసుకుంటే కొన్నిరోజులు నాన్‌ వెజ్‌ తినకూడదన్న అపొహతో శనివారం కూడా కేంద్రాలకు రావడం లేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉదయం 9గంటల నుంచి మొదలై రాత్రి 7గంటల వరకు కొనసాగిస్తున్నారు. కళాశాలలు, విద్యాలయాలకు వెళుతున్న వారిలో కొందరు సమయం సరిపోక వేసుకోవడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కళాశాలల కేంద్రంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపడితే అర్హులైన విద్యార్థులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ కొందరు ఇప్పుడు కరోనా లేదని వెనుకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ పూర్తయితే వేరియంట్లు వచ్చినా ఇబ్బందులు తక్కువగా ఉంటాయని చెబుతున్నా ఆసక్తి చూపడం లేదని మండలస్థాయిలో పనిచేస్తున్న అధికారి ఒకరు వివరించారు.

జిల్లాలో 18 ఏళ్లు పైబడి వ్యాక్సినేషన్‌కు గుర్తించిన లబ్ధిదారులు 
35,93,923
ఇప్పటివరకు టీకా వేయించుకున్నవారు :
22,78,248
15వతేదీ వేయించుకున్నవారు : 
27,316
జిల్లాలో ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య : 
23,05,564
15వ తేదీ రెండో డోస్‌ వేసుకున్నవారు :
26,054
జిల్లాలో రెండు డోసులు టీకా వేయించుకున్న వారు:
8,17,397 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని