ప్రభుత్వ పథకాలు అర్హులకందాలి
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

ప్రభుత్వ పథకాలు అర్హులకందాలి


సచివాలయ సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎల్‌డీవో అర్జున్‌రావు

దుర్గి, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించాలని డీఎల్‌డీవొ బి.అర్జునరావు అన్నారు. మండలంలోని దుర్గి, ఓబులేశునపల్లె, అడిగొప్పల, కోలగుట్ల గ్రామాల్లోని సచివాలయాను బుధవారం తనిఖీ చేశారు. సచివాయాల నుంచి సిబ్బంది ప్రభుత్వం అమలు చేస్తున్నపలు సంక్షేమ పథకాలు ఎంతమేరకు అమలు చేస్తున్నారు, అర్హులకు ఎంతవరకు పథకాలు అందుతున్నాయి అనేకోణంలో సిబ్బందిని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నిరికార్డులు సిబ్బంది సక్రమంగా నిర్వహిస్తున్నారా అని పరిశీలించారు. అనంతరం స్ధానిక ఎంపీడీవొ కార్యాలయంలో మిగిలిన గ్రామ సచివాలయాల సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించి పలుసూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవొ పి.రాంబాబు, ఈవొపీఆర్డీ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని