పచ్చబొట్టుతో అభిమానం చాటి..
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

పచ్చబొట్టుతో అభిమానం చాటి..


చేతిపై పచ్చబొట్టును ఎమ్మెల్యేకు చూపిస్తున్న అనిల్‌కుమార్‌

 

కరీంనగర్‌ గ్రామీణం, చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి వాసి దూడం అనిల్‌ అనే యువకుడు చిలుకలూరిపేట శాసనసభ్యురాలు రజనీ చిత్రాన్ని చేతిపై పచ్చబొట్టు వేయించుకుని తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. అనిల్‌ ఫొటోను ట్విటర్‌లో చూసిన శాసనసభ్యురాలు రజనీ అనిల్‌ను శుక్రవారం చిలకలూరిపేట పిలిపించి అభినందించారు. రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పారని అనిల్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని